ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షలు ఇవ్వాలి' - మార్కాపురంలో వెలిగొండ నిర్వాసితుల ఆందోళన వార్తలు

తమకు ఒక్కో కుటుంబానికి రూ. 20లక్షలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వెలిగొండ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

veligonda expats protest in markapuram prakasam district
వెలిగొండ నిర్వాసితుల ఆందోళన

By

Published : Jul 1, 2020, 2:58 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంత రైతులు ఆందోళన చేపట్టారు. 3 జిల్లాల అన్నదాతలు, ప్రజలను దృష్టిలో ఉంచుకొని తమ పొలాలు, ఇళ్ల స్థలాలు త్యాగం చేశామని.. ఇప్పుడు పరిహారం అందజేయడంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వాపోయారు. తమ గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

దీనిపై ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ గంగాధర్ సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు తమ డిమాండ్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమ ప్రాంతాల్లో ఇంకా అర్హులు ఉన్నారని.. వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details