ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామంలో వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంత రైతులు ఆందోళన చేశారు. గ్రామసభ నిర్వహించేందుకు వస్తున్న అధికారులను అడ్డుకున్నారు. ముంపు ప్రాంతం పరిహారం చెల్లింపులో తమకు అన్యాయం జరిగిందని రైతులు వాపోయారు. తమకు రూ.20 లక్షలు పరిహారం చెల్లించి, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ముంపు ప్రాంత వాసులు డిమాండ్ చేశారు.
గొట్టిపడియలో వెలిగొండ నిర్వాసితుల ఆందోళన
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామంలో వెలిగొండ నిర్వాసితులు ఆందోళన చేశారు. గ్రామ సభ నిర్వహించేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. పరిహారం చెల్లించాల్సిన వారు ఇంకా ఉన్నారని, వారి పేర్లను సర్వేలో చేర్చాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ పరిహారం అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామసభలు నిర్వహణకు గ్రామస్థులు అంగీకరించారు.
గొట్టిపడియలో వెలిగొండ నిర్వాసితుల ఆందోళన
పరిహారం అందాల్సిన వారు గ్రామంలో ఇంకా ఉన్నారని.... వారి పేర్లు సర్వేలో నమోదు చేయాలని అధికారులను కోరారు. అర్హులైన వారికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు అధికారులు హామీ ఇచ్చారు. దీంతో గ్రామ సభలు నిర్వహించేందుకు రైతులు అంగీకరించారు.
ఇదీ చదవండి :తెలంగాణలో దారుణం: కోతికి ఉరి వేసి చంపిన మానవ మృగం