ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట వెలిగొండ నిర్వాసితులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఆర్డీఓ కార్యాలయం తలుపులు మూసివేసి నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఇటీవల అర్దవీడు మండలంలో ఆత్మహత్యకు పాల్పడిన నిర్వాసితురాలి కుటుంబానికి 50 లక్షల ఆర్థికసాయం ప్రకటించాలని రైతు సంఘం నాయకుడు వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.
VELIGONDA EXPATRIATES: ఆర్డీఓ కార్యాలయం తలుపులు మూసేసి ఆందోళన - వెలిగొండ నిర్వాసితులు ఆందోళన
ప్రకాశం జిల్లా మర్కాపూరం ఆర్డీఓ కార్యాలయం తలుపులు మూసివేసి వెలిగొండ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. ఆత్మహత్యకు పాల్పడిన బాధిత కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఆర్డీఓ కార్యాలయం తలుపులు మూసేసి ఆందోళన
2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని ఆయన కోరారు. 18 ఏళ్ళు పైబడిన యువతీ యువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలంటూ.. కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ క్రమంలో నిర్వాసితులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఇదీ చూడండి:Amaravati padayatra: కడలి తరంగంలా.. అమరావతి ఉద్యమం