'కరోనా కట్టడికి అందరూ సహకరించాలి' - martur latest news
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని ప్రకాశం జిల్లా మార్టురు ఎస్సై శివకుమార్ కోరారు. ఈ మేరకు మార్టురులోని కూరగాయల మార్కెట్, మాంసం దుకాణాలను పరిశీలించారు.
!['కరోనా కట్టడికి అందరూ సహకరించాలి' vegetable markets inspecting martur si](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7802986-118-7802986-1593329102734.jpg)
మాంసం దుకాణాల వద్ద భౌతిక దూరాన్ని పరిశీలిస్తున్న ఎస్సై
ప్రకాశం జిల్లా మార్టూరు ఎస్సై శివకుమార్ తన సిబ్బందితో ఆదివారం కూరగాయల మార్కెట్, మాంసం దుకాణాలను పరిశీలించారు. మాంసం దుకాణాల వద్ద ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించేలా ఏర్పాటు చేశారు. దుకాణాదారులకు పలు సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.