God Of Mass : నటసింహం నందమూరి బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటించిన వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రకాశం జిల్లా ఒంగోలులో కన్నుల పండుగలా జరిగింది. అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో.. ఒంగోలులో జాతర వాతావరణం తలపించింది. బాలయ్యను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణం నిండిపోయి అభిమానులు బయటే మిగిలిపోయారు. ఎంట్రీ పాసులు ఉన్నా లోపలకు పంపించలేదని అభిమానులు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేసి అభిమానులను నియంత్రించారు. పోలీసులు అడుగడుగునా భారీ బందోబస్తు నిర్వహించారు.
'రికార్డులు తిరగరాసేది మేమే'.. 'జై బాలయ్య' నినాదాలతో మార్మోగిన ఒంగోలు - బాలయ్యను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు
God Of Mass : నందమూరి అభిమానులు అంటే మాములుగా ఉండదు అన్నట్లుగా ఒంగోలులో జాతర వాతావరణం తలపించింది. రికార్డులు తిరగారాసేది మేమే.. జై బాలయ్య నినాదాలతో సభ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. వీరసింహారెడ్డి సినిమా ఆంక్షలతో సాగింది. గాడ్ ఆఫ్ మాస్ అభిమాన ప్రవాహాన్ని భద్రత దృష్ట్యా నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. సంక్రాంతికి చరిత్ర సృష్టించి సంతకం చేయడానికి వస్తున్నాడు వీరసింహరెడ్డి.
ఎన్నో సినిమాలు చేశాను.. ఇంకా కాక తీరలేదు..: తల్లిదండ్రులను తలచుకొని బాలయ్య ప్రసంగం ప్రారంభించారు. " ఈ వేడుకతో సంక్రాంతి పండుగ ప్రారంభమైంది. గోపీ చంద్ మలినేని అద్భుతంగా దర్శకత్వం చేశారు...శ్రుతిహాసన్ డీఎన్ఎలోనే నటన ఉంది.. గొప్ప నటి. ముత్యాలు ఏటవాలుగా జారితే ఎంత అందంగా ఉంటాయో.. నటీనటుల నుంచి అలా నటనను గోపీచంద్ రప్పించారు.. ఎన్నో సినిమాలు చేశాను.. ఇంకా కాక తీరలేదు... బిన్నమైన పాత్రలు, బాధ్యతలు నిర్వహించడంలోనే తృప్తి... అందులో భాగంగానే ఆహా ఓటిటిలో అన్ స్టాపబుల్ టాక్షో ... ప్రపంచం లోనే గొప్పషోగా దీనికి పేరొచ్చింది.. వీర సింహా రెడ్డి చిత్రం బాగా ఆడుతుంది.." అని తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన వాళ్లంతా క్షేమంగా ఇంటికి వెళ్లాలని అభిమానులకు బాలకృష్ణ సూచించారు.
ఇవీ చదవండి