Masses Of God Veerasimha Reddy: నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు ఎట్టకేలకు స్థలం ఖరారు అయింది. తొలుత ఒంగోలులోని ఏబీఎం కళాశాల మైదానంలో ఈ నెల 6న సాయంత్రం వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా అందుకు పోలీసులు నిరాకరించారు. అనంతరం నగర శివారులోని బీఎంఆర్ లేఅవుట్లో ఈవెంట్‌ను నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతిచ్చారు. పోలీసుల నుంచి అనుమతి లభించాక ఈవెంట్‌కు సంబందించిన ఏర్పాట్లను చిత్ర బృందం శరవేగంగా చేస్తోంది.
చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రకాశం జిల్లా వాసి కావడంతో వేడుకను ఒంగోలులో జరప తలపెట్టారు. చిత్ర కథానాయకుడు బాలకృష్ణ, కథానాయిక శృతిహాసన్‌తో పాటు వరలక్ష్మీ శరత్‌కుమార్, సంగీత దర్శకుడు థమన్, చిత్ర సాంకేతిక బృందం హాజరవుతారని ప్రచారం.
ఏబీఎం కళాశాల మైదానంలో ఎందుకు వద్దన్నారంటే...
ఏబీఎం కళాశాల మైదానానికి రెండువైపులా ఉండే రహదారులు ఒంగోలు రైల్వేస్టేషన్‌కు దారితీసేవి కావడం, ఒకవైపున కార్పొరేట్ వైద్యశాల ఉండటంతో ప్రయాణికులు, రోగులకు ఇబ్బందులు తలెత్తుతాయని, అంబులెన్స్ వెళ్లే అవకాశం లేనంత రద్దీ ఏర్పడుతుందని, అందుకే అనుమతులు రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. దీంతో శ్రేయాస్ మీడియా ప్రతినిధులు బుధవారం సాయంత్రం ఎస్పీతో సమావేశమయ్యారు.
నాడు మహానాడు... నేడు చిత్ర వేడుక
గత ఏడాది మేలో టీడీపీ మహానాడును నిర్వహించడానికి ఒంగోలులోని మినీ స్టేడియాన్ని పరిశీలించిన నాయకులు అనుమతి కోసం నిర్ణీత నగదు చెల్లించారు. విద్యార్థులకు వేసవి శిక్షణ కార్యక్రమం ఉందని... ఆ ప్రాంగణాన్ని ఇవ్వలేమని చెప్పడంతో ప్రత్యామ్నాయంగా మండువవారిపాలెం సమీపంలోని భూములను పరిశీలించారు. ఈక్రమంలో పొలాలు ఇవ్వకుండా రాజకీయంగా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. అయినా గ్రామస్థులు భయపడకుండా ఇవ్వడంతో మహానాడును విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు తెదేపా హిందూపురం శాసనసభ్యుడు, కథానాయకుడు బాలకృష్ణ సినిమా వేడుకకు 48 గంటల ముందు ఇలా జరగడంతో అభిమానులు, జిల్లాకు చెందిన సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి