ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేరస్తులకు ప్రభుత్వం ఫ్రెండ్లీగా నడుస్తోంది: వర్ల రామయ్య - వర్ల రామయ్య

Varla Ramaiah on Crime in AP: రాష్ట్రంలో హత్యలు, అత్యాచార ఘటనలు నిత్యకృత్యమయ్యాయని..నేరస్తులకు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా నడుస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.

Varla Ramaiah fired on Crime in AP
Varla Ramaiah fired on Crime in AP

By

Published : May 5, 2022, 1:58 PM IST

Varla Ramaiah on Crime in AP: రాష్ట్రంలో హత్యలు, అత్యాచార ఘటనలు నిత్యకృత్యమయ్యాయని..నేరస్తులకు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా నడుస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. రేపల్లె ఘటనలో ఒంగోలు రిమ్స్​లో చికిత్స పొందుతున్న బాధితుల పరామర్శకు వెళ్లిన వర్లను అనుమతి లేదంటూ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగటంతో అనుమతిచ్చారు. బాధితులకు పరిహారం ఎంత ఇచ్చారో కూడా తెలియదన్నారు. వారికి న్యాయం చేయాలని కోరారు. హోంమంత్రి వనిత కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వం నేరస్తులకు ఫ్రెండ్లీగా నడుస్తోంది -వర్ల రామయ్య

ABOUT THE AUTHOR

...view details