ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరికపూడిశెల ప్రాజెక్ట్‌‌కు పూర్తి చేసి- పొలాలకు సాగు నీరు అందించండి మహోప్రభో! - Varikapudishela Project Works news

Varikapudishela Project Works Updates: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై పల్నాడు, ప్రకాశం జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు శంకుస్థాపన చేసిన వరికపూడిశెల ప్రాజెక్ట్‌‌కు మరోసారి సీఎం జగన్ శంకుస్థాపన చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ శంకుస్థాపనల పేరుతో హడావిడి చేస్తున్నారే తప్ప.. ప్రాజెక్టును పూర్తి చేసి, పొలాలకు నీరందించే పరిస్థితి లేదని దుయ్యబడుతున్నారు.

Varikapudishela_Project_Works_Updates
Varikapudishela_Project_Works_Updates

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 9:43 AM IST

వరికపూడిశెల ప్రాజెక్ట్‌‌కు పూర్తి చేసి- పొలాలకు సాగు నీరు అందించండి మహోప్రభో!

Varikapudishela Project Works Updates: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పల్నాడు, ప్రకాశం జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో శంకుస్థాపన చేసిన వరికపూడిశెల ప్రాజెక్ట్‌‌కు నిధులు కేటాయించకుండా.. మూడోసారి శంకుస్థాపన చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు శంకుస్థాపనలు చేసినా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ప్రాజెక్ట్‌ పరిస్థితి మారిందని దుయ్యబడుతున్నారు. మరో ఐదారు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో సీఎం జగన్.. శంకుస్థాపనల పేరుతో హడావిడి చేస్తున్నారే తప్ప.. ప్రాజెక్టును పూర్తి చేసి, పొలాలకు నీరందించే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు.

Palnadu, Prakasam Districts Farmers Fire on CM Jagan: పల్నాడు జిల్లాని సస్యశ్యామలంగా మార్చే కలల ప్రాజెక్టు వరికపూడిశెల. ఇప్పటికే రెండుసార్లు శంకుస్థాపనలు చేసినా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది ఈ ప్రాజెక్ట్‌ పరిస్థితి. తాజాగా ఈనెల 15న వరికపూడిశెలకు ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేయడానికి జగన్ మాచర్ల వస్తున్నారు. ఈ క్రమంలో మరో ఐదారు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో శంకుస్థాపన అంటూ హడావిడి తప్పితే.. ప్రాజెక్టు పూర్తి చేసి పొలాలకు నీరందించే పరిస్థితి లేదని పల్నాడు రైతులు సందేహిస్తున్నారు.

వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి తొలిదశ నిధులు మంజూరు

This is Varikapudishela Project Objective: సాగునీరు అందని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని ఆయకట్టుకు.. నాగార్జున సాగర్‌ జలాశయం బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోసి సాగర్‌ కుడి కాలువ కింద సాగునీరు ఇవ్వాలనేది వరికపూడిశెల ప్రాజెక్టు లక్ష్యం. తొలి విడత కింద పల్నాడు జిల్లాకు, రెండో విడతలో పల్నాడుతో పాటు ప్రకాశం జిల్లాలోని సాగు భూములకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు చెంతనే ఉన్నా.. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాల రైతులకు సాగునీరు అందని పరిస్థితి. దశాబ్దాలుగా సాగునీరు అందించాలని రైతులు ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నారు. సాగర్‌ జలాశయం బ్యాక్‌వాటర్‌ నుంచి వరికపూడిశెల వాగులోకి నీటిని ఎత్తిపోయడం ద్వారా సాగునీరు అందించాలన్న డిమాండ్‌ కొన్నేళ్లుగా కొనసాగుతోంది.

CBN, YS Rajasekhar Reddy Foundation Stone for Varikapudi: ఇక్కడి రైతుల డిమాండ్‌ మేరకు.. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వరికపూడిశెల ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారు. అయితే, పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వరికపూడిశెల ప్రాజెక్టు పంపు హౌస్, పైపులైను నిర్మించే ప్రాంతం రిజర్వు అటవీ ప్రాంతంతో పాటు వైల్డ్‌లైఫ్‌ ప్రాంతంలో ఉండటంతో అనుమతులు రాక పథకం పనులు ప్రారంభం కాలేదు.

CM Jagan Foundation Stone on November 15: వరికపూడిశెల ప్రాజెక్టులో తొలి దశలో వెల్దుర్తి మండలంలోని.. 24,900 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో 340కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తొలి దశకు 298కోట్ల రూపాయలతో టెండరు దక్కించుకున్న మెగా ఇంజినీరింగ్‌ కంపెనీ.. మార్చి 2019లో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం మారడం, అటవీ శాఖ అనుమతులు అప్పటికి రాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా దుర్గి మండలం ఓబులేశునిపల్లిలో.. 53 ఎకరాలు భూమి కేటాయించడం, పరిహారం ఇతర మార్గదర్శకాలు పూర్తిచేయడంతో నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌ తొలి దశ అనుమతులు మంజూరు చేసింది. కొన్నేళ్లుగా ప్రధాన అడ్డంకిగా ఉన్న రిజర్వు అటవీ ప్రాంతం సమస్య.. పరిష్కారం కావడంతో ప్రాజెక్టుకు అడ్డంకి తొలగిపోయింది. ఈ తరుణంలో నవంబరు 15న మాచర్లలో సీఎం జగన్‌తొలి దశ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ 'చలో పుట్టపర్తి'కి టీడీపీ పిలుపు-నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు

Water For 1 lakh 29 Thousand Acres Two Phases: వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామం సమీపంలోని వరికపూడివాగు కుడివైపున ఎత్తిపోతల పథకం నిర్మిస్తారు. ఇక్కడి నుంచి సాగర్‌ జలాశయం బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోస్తారు. తొలి దశలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. రెండో దశలో పల్నాడు జిల్లాలో వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి, గురజాల, బొల్లాపల్లి మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలంలోని ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. రెండు దశల్లో కలిపి లక్షా 29వేల ఎకరాల ఆయకట్టుకు సాగర్‌ జలాలు అందుతాయి. అయితే, ఎన్నికల కోసం హడావిడి తప్ప.. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రణాళికలు రూపొందించలేదని సాగునీటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

CM Jagan Review on Agriculture, Civil Supplies Departments: రైతులు పండించిన పంటకు కచ్చితంగా మద్దతు ధర దక్కాలి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details