బైక్ పై వచ్చి దర్జా ఒలకబోశాయి ....కారులో వచ్చి రాజసం చూపాయి. సూది మందు గుచ్చితే మారం చేశాయి. ప్రపంచ జునోసెస్ రోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో పశు సంవర్ధక శాఖ కార్యాలయం ఆవరణలో పెంపుడు శునకాలకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగరవాసులు తమ పెంపుడు శునకాలను ఆప్యాయంగా తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి కేటాయించిన శునకాలకు శిక్షకులు తీసుకువచ్చి వ్యాక్సిన్ అందించారు.
'జూనోసెస్ డే' కి విశేష స్పందన - ఒంగోలు
ప్రకాశం జిల్లాలో జూనొసెస్ డే సందర్భంగా శునకాలకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం జరిగింది.ఇందుకు విశేష స్పందన వచ్చింది.
వ్యాక్సిన్ వేయించుకుంటున్న శునకాలు.