ప్రకాశం జిల్లా దర్శి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కొవిడ్ టీకా కార్యక్రమం ఏర్పాటు చేశారు. రెండో డోసు వేయించుకునే వారు మాత్రమే కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆరోగ్య సిబ్బంది తెలిపారు. మార్చి 31లోపు వేయించుకున్న వారికి టీకా వేస్తున్నామని.. మిగతావారికి రోజువారీ పద్ధతిలో టీకాలు వేస్తామని చెప్పారు.
ప్రజలు దయచేసి అర్ధం చేసుకుని సహకరించాలని మండల ఆరోగ్య విస్తరణాధికారి కోరారు. ప్రతి ఒక్కరికి ముందు రోజు ఏఎన్ ఎం, ఆశా వర్కర్, వాలంటీర్ల ద్వారా స్లిప్పులు పంపిణీ చేస్తామని.. అది ఉన్నవారే వ్యాక్సినేషన్ కేంద్రానికి రావాలని కోరారు. స్లిప్పులు పంచటంలో అవగాహనా లోపం వల్ల కొందరు వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చి వెనుదిరిగారు.