ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TEACHERS PROTEST : జీవో 172 రద్దు కోరుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు

By

Published : Jul 15, 2021, 7:27 PM IST

జీవో నెం 172ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. ఈ జీవోతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రాథమిక విద్య (primary education)కు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 3, 4, 5 తరగతులను వేరుచేసి ప్రాథమికోన్నత (upper primary), ఉన్నత పాఠశాలల (high school)కు తరలిస్తే మొత్తం ప్రాథమిక వ్యవస్థ (primary education) నిర్వీర్యం అవుతుందని వాపోయారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించి జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు

ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసేలా.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 172 ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గ్రామీణ మండల విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ జీవో అమలుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.

  • ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, జీవో 172ను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ... విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఆందోళన నిర్వహించారు. ఈ జీవోతో ప్రాథమిక విద్య నిర్వీర్యం అవుతుందని, ప్రాథమిక విద్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
  • 'మా బడి - మా ఊర్లోనే ఉంచండి' అని పార్వతీపురంలో విద్యార్థుల తల్లిదండ్రులు నినాదాలు చేశారు.
  • నూతన జాతీయ విద్యావిధానం అమలుకు జారీ చేసిన జీవో 172 రద్దు చేయాలని.. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసే ఆలోచనను మానుకోవాలంటూ ప్రకాశం జిల్లా చీరాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జాతీయ నూతన విద్యా విధానం-2020 ద్వారా ప్రాథమిక విద్య... మాతృభాషలోనే బోధించాల్సిన సూచనకు విరుద్ధంగా ఉంటుందని యూటీఎఫ్ నాయకులు అన్నారు.
  • గుంటూరు జిల్లా తెనాలిలో ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయులు... అంగన్​వాడీలు ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details