ప్రకాశం జిల్లా బల్లికురవ ఎంపీడీఓ కార్యాలయం వద్ద వి.కొప్పెరపాడు గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు ధర్నా చేశారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన కూలీల కుటుంబాలకు నెలకు రూ.7500 చొప్పున మూడు నెలలు ఇవ్వాలని, సంవత్సరంలో 200 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు కార్డుల పేరుతో కూలీల నుంచి రూ.50 అక్రమ వసూలు చేయడాన్ని మానుకోవాలని, గుర్తింపు కార్డులను ప్రభుత్వమే అందజేయాలని కోరారు. అనంతరం స్థానిక ఏపీఓకు వినతి పత్రం అందించారు.
బల్లికురవలో ఉపాధి హామీ కూలీల నిరసన - ప్రకాశం జిల్లాలో నిరసన
ప్రకాశం జిల్లా బల్లికురవ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉపాధి హామీ కూలీలు నిరసన వ్యక్తం చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏపీఓకు అందించారు.
బల్లికురవలో ఉపాధి హామీ కూలీల నిరసన