ప్రకాశంజిల్లా చినగంజాంలో ఉపాధి పని చేస్తూ గుండెపోటుతో కూలీ మృతిచెందాడు. కొండపాటూరి ఆంజనేయులు దివ్యాంగుడు. చినగంజాం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పంటకాలువలో ఉపాధి పనులు చేస్తున్నాడు. ఉదయం పనికి వెళ్లిన ఆంజనేయులు కొద్దిసేపటికే గుండెపోటుతో చనిపోయాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని ఇంటికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏపీఓ సంతోషం అతని కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఉపాధి పనులు చేస్తూ గుండెపోటుతో కూలీ మృతి - చినగంజాంలో ఉపాధి కూలీ మృతి వార్తలు
ఉపాధి పనులు చేస్తూ గుండెపోటుతో కూలీ మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా చినగంజాంలో జరిగింది. ఆంజనేయులు అనే దివ్యాంగుడు ఉపాధి పని చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు.
![ఉపాధి పనులు చేస్తూ గుండెపోటుతో కూలీ మృతి upadhi coolie died at chinaganjam prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6935233-753-6935233-1587806573927.jpg)
ఉపాధి పనులు చేస్తూ గుండెపోటుతో కూలీ మృతి