ప్రకాశం జిల్లా చీరాలలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉచితంగా రేషన్ సరుకుల పంపిణీని నిలిపివేశారు. కరోనా పాజిటివ్ వచ్చినందున దుకాణాల వద్ద కార్డు దార్లు గుమిగూడే ప్రమాదం ఉన్న కారణంగానే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. తాము చెప్పేవరకు కార్డుదారులకు రేషన్ ఇవ్వవద్దని అధికారులు ఆదేశించారని డీలర్లు పేర్కొన్నారు. ఫలితంగా.. రోజూవారి కూలీలకు సరుకులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వాలంటీర్ల ద్వారా అయినా.. నిత్యావసరాలను అందించాలని వారు కోరుతున్నారు.
అక్కడ రేషన్ దుకాణాలు బంద్.. కారణం? - చీరాలలో ఇద్దరికి కరోనా పాజిటివ్
ఓ ప్రాంతంలో ముగ్గురికి కరోనా వచ్చిన కారణంగా.. అక్కడున్న ప్రజలందరికీ రేషన్ పంపిణీని ఆపేశారు. దుకాణాల వద్ద గుమిగూడే ప్రమాదం ఉందని వారికి నిత్యవసరాలను నిలిపివేశారు. కనీసం వాలంటీర్లతోనైనా సరకులను పంపిణీ చేయాలని.. రోజూవారి కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.
చీరాలలో మూతపడ్డ రేషన్ దుకాణాలు