ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొదల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం - prakasam latest news

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు గ్రామ సమీపంలో గంగవరం వెళ్లే రహదారి పక్కన ఉన్న పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

unknown person dead body found in the bushes at pullalacheruvu
పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

By

Published : Oct 26, 2020, 4:51 PM IST

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో పుల్లలచెరువు గ్రామ సమీపంలో గంగవరం వెళ్లే రహదారి పక్కన ఉన్న పొదల్లో పడి ఉన్న ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా... ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. గాయాలతో పొదల్లో పడి ఉన్న మృతుడు.. తెలుపు రంగు చొక్కా, జీన్స్ ధరించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details