ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎనిమిదేళ్ల బాలుడిని హతమార్చిన దుండగులు.. వివాహేతర సంబంధమే కారణమా? - ప్రకాశం జిల్లా నేర వార్తలు

ఎనిమిదేళ్ల బాలుడిని దుండగులు బండరాయితో కొట్టి హత్య చేసిన ఘటన బుధవారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగింది. బాలుడి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తోన్న పోలీసులు... ఈ దారుణానికి వివాహేతర సంబంధమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎనిమిదేళ్ల బాలుడిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు
ఎనిమిదేళ్ల బాలుడిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు

By

Published : Mar 24, 2021, 8:54 PM IST

Updated : Mar 25, 2021, 5:57 PM IST

అమ్మమ్మ చెంత హాయిగా నిద్రిస్తున్న ఎనిమిదేళ్ల బాలుడిని అలికిడి లేకుండా అపహరించుకెళ్లిన దుండగులు.. బండరాయితో మోది కర్కశంగా హతమార్చారు. హృదయ విదారకమైన ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణ శివారులో బుధవారం జరిగింది. గుంటూరు జిల్లా దాచేపల్లెకు చెందిన లక్ష్మికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సాయికల్యాణ్‌(8) అనే బాలుడున్నాడు. నాలుగేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిన లక్ష్మి.. దాచేపల్లెకు చెందిన మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. ఇటీవల వారి మధ్య కూడా మనస్పర్థలు రావడంతో ఆమె బాలుడిని తీసుకొని యర్రగొండపాలెంలో ఉంటున్న తల్లి కృష్ణవేణి వద్దకు చేరింది. కుటుంబ పోషణార్థం లక్ష్మి యర్రగొండపాలెంతో పాటు తెలôగాణ రాష్ట్రం మిర్యాలగూడలోనూ చీరల వ్యాపారం ప్రారంభించింది. తాను మిర్యాలగూడలోనే ఉంటూ నాలుగు రోజుల క్రితం కుమారుడు సాయి కల్యాణ్ను తల్లి కృష్ణవేణి వద్ద విడిచిపెట్టి వెళ్లింది.

వివాహేతర సంబంధమే కారణమా?

మంగళవారం రాత్రి అమ్మమ్మతో పాటు నిద్రిస్తున్న బాలుడిని అపహరించిన దుండగులు.. మార్కాపురం రోడ్డులో బండరాయితో కొట్టి పాశవికంగా హత్య చేశారు. బుధవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్‌, సీఐ దేవప్రభాకర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు క్లూస్‌ టీమ్‌ ఎస్సై శరత్‌బాబు వేలిముద్రలు సేకరించారు. మృతుడి అమ్మమ్మ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా ఈ దారుణం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి:

విద్యుత్​ తీగకు ఐదు గేదెలు బలి.. తల్లడిల్లిన యజమాని

Last Updated : Mar 25, 2021, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details