ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళపై కత్తితో దాడి చేసిన దుండగులు - మహిళపై కత్తితో దాడి

మహిళపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. గాయపడిన మహిళను సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

attack
attack

By

Published : Mar 23, 2022, 6:11 PM IST

ప్రకాశం జిల్లా చీరాల ఓవర్‌ బ్రిడ్జి రహదారి వద్ద ఓ మహిళపై గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. గాయాలపాలైన మహిళను 108లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మెడపై గాయం కావడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళపై ఎవరు దాడి చేసి ఉంటారనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:శ్రీకాళహస్తిలో దారుణం... మురుగుకాలువలో శిశువు మృతదేహం

ABOUT THE AUTHOR

...view details