ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నోట్లో నుంచి నురుగు వస్తుండడాన్ని గమనించిన స్థానికులు.. అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.
పోలీసులు పరిసర ప్రాంతాల్లో అతని గురించి ఆరా తీశారు. మృతుడిని ఎవరూ గుర్తించని కారణంగా పంచనామా నిర్వహించి మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.