సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన విషాద ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్‌కు చెందిన 15 మంది సముద్ర స్నానానికి చీరాల మండలం వాడరేవు వెళ్లారు. ఒక్కసారిగా అలలు తాకిడి ఎక్కువ కావడంతో ఎస్. విజయ్ బాబు(17), పి. సాయి(17) గల్లంతయ్యారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. చీరాల డీఎస్పీ పి. శ్రీకాంత్ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గజఈతగాళ్లు గాలింపు చేపట్టారు.
వాడరేవు వద్ద సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతు - two people missing ocean at cheerala
సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
వాడరేవు వద్ద సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతు