ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులో పడి ఇద్దరు యువతులు మృతి - దుద్దుకూరులో ఇద్దరు యువతులు మృతి

ప్రకాశం జిల్లా దుద్దుకూరులో కర్ణాటకకు చెందిన వలస కూలీలు ఇద్దరు చెరువులో పడి మృతి చెందారు.

two young girls died because of lying in the pond at duddukuru prakasam district
ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఇద్దరు యువతులు మృతి

By

Published : May 6, 2020, 3:00 PM IST

ప్రకాశంజిల్లా ఇంకొల్లు మండలం దుద్దుకూరులో ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఇద్దరు యువతులు మృతిచెందారు. దుస్తులు ఉతికేందుకు వెళ్ళిన పింజర మునిమ్మ ప్రమాదవశాత్తూ చెరువులో పడింది. ఆమెను కాపాడబోయిన బంట్రోతు ఉషమ్మ నీళ్లలోకి జారిపోయి ఇద్దరూ మృతిచెందారు. వారిని కర్ణాటక రాష్ట్రం రాయచూర్ ప్రాంతంలోని జలంగిరి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

3 నెలల క్రితం మిరప కాయలు కోసేందుకు జలంగిరికి చెందిన 500 మంది కూలీలు దుద్దుకూరుకు వచ్చారు. లాక్ డౌన్ కారణంగా పనులకు వెళ్ళటం లేదు. స్వగ్రామాలకు వెళ్ళాలని పోయిన వారం అద్దంకి వరకు వెళ్ళగా పోలీసులు అడ్డుకోవటంతో వెనక్కి వచ్చారు. ఈరోజు చెరువులో పడి వారిలో ఇద్దరు మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details