ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పాత మల్లపురం గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. వీరితో పాటు 36 మేకలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... మరొక మహిళ కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణం విడిచింది. స్థానిక పొలంలో ఉన్న ఓ చెట్టు వద్ద వీరు మేకలు మేపుతుండగా ఒక్కసారిగా వారిపై పడిన పిడుగు.. ఇంతటి విషాదానికి కారణమైంది.
పిడుగుపడి ఇద్దరు మహిళలు, 36 మేకలు మృతి - పాత మల్లపురంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి
పిడుగుపడి ఇద్దరు మహిళతో పాటు 36 మేకలు మృతి చెందాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా పాతమల్లపురంలో జరిగింది.
పిడుగుపడి ఇద్దరు మహిళలతో పాటు 36మేకలు మృతి