పిడుగుపడి ఇద్దరు మృతి... మరో ఇద్దరికి గాయాలు - Two womens died news in pathamallpuram
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పాత మల్లపురం గ్రామంలో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా... మరో మహిళ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.
పిడుగుపడి ఇద్దరు మృతి... మరో ఇద్దరికి గాయాలు
పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా పాత మల్లపురంలో జరిగింది. గ్రామం సమీపంలోని పొలంలో మేకలు కాస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... మరో మహిళ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని వైద్యం కోసం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనలో 36 మేకలు కూడా మృతి చెందాయి.