ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ పరిధిలోని కలవకూరు రహదారిపై జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికంగా నివసించే బత్తుల మాధవ ద్విచక్రవాహనంపై వేగంగా వెళుతూ అదుపు తప్పి పడిపోయాడు. అతను అక్కడికక్కడే మరణించాడు. వేగ నిరోధకం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న అద్దంకి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి - బత్తుల మాధవ ద్విచక్ర వాహనం
అద్దంకి పట్టణ పరిధిలో అతి వేగం ఓ యువకుడి ప్రాణం తీసింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. వేగ నిరోధకం వద్ద ద్విచక్రవాహనాన్ని అదుపు చేసే యత్నంలో యువకుడు కింద పడిపోయాడు. అక్కడికక్కడే ప్రాణం విడిచాడు.
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం.. యువకుడు మృతి