ఉన్నత చదువులకోసం బిహార్ వెళ్లిన ప్రకాశం జిల్లా విద్యార్థులు... గంగానదిలో జారిపడిన మృతిచెందారు. పాట్నా సమీపంలోని భాగల్పూర్ ట్రిపుల్ఐటీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు... శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు. దర్శికి చెందిన ఫణితేజ ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. అద్దంకికి చెందిన వెంకటసాయి కిరణ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శని, ఆదివారం సెలవు కావటంతో వీరిద్దరూ కలసి గంగానది చూడటానికి వెళ్లారు. చేతులు కడుగుతుండగా నదిలో జారి పడి మరణించారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన పాట్నా వెళ్లారు
గంగానదిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి - Two students in the Ganges at bihar state
బిహార్ రాష్ట్రం బాగల్పూర్ ట్రీపుల్ ఐటీలో చదువుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు గంగా నదిలో పడి మృతి చెందారు. సెలవు రోజున సరదాగా ఈతకు వెళ్లిన వారిని మృత్యువు కబళించింది.
గంగానదిలో గల్లంతైన విద్యార్థులు