ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పేరంగుడిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇండ్ల లోకేష్(14) ఇండ్ల దినేష్(14) అనే ఇద్దరు విద్యార్థులు పాఠశాలలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తోటి స్నేహితులతో కలిసి గ్రామం సమీపంలో నూతన రైల్వే వంతెన నిర్మాణం కోసం తీసిన పెద్ద గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లారు. గుంతలో లోతు ఎక్కువగా ఉండడం, ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. తోటి స్నేహితులు కళ్లెదుటే నీటిలో మునిగి పోతుండడాన్ని చూసిన మిగతా విద్యార్థులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పెద్ద పెద్దగా కేకలు వేశారు. సమీప పొలాల్లోని రైతులు గుంత వద్దకు వచ్చి ఇద్దరు విద్యార్థుల బయటకు తీశారు. అప్పటికే వారు చనిపోయి ఉన్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మృతి చెందిన ఇండ్ల దినేష్ తల్లి అదే గ్రామానికి సర్పంచ్ కాగా.. లోకేష్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు చిన్నారుల మృతితో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇదీ చదవండి:సామాజిక మాధ్యమాల్లో పోస్టులు.. పోలీసుల అదుపులో హిందూ ఐక్య వేదిక సభ్యులు
సరదాగా ఈతకు వెళ్లి.. ఇద్దరు విద్యార్థులు మృతి
పాఠశాలలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆ విద్యార్థులు సరదాగా ఈతకు వెళ్లారు. అదే వారి పాలిట శాపంగా మారింది. రైల్వే వంతెన కోసం తీసిన గుంత కావడం, లోతు ఎక్కువగా ఉండడంతో పాటు వారికి ఈత రాకపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగి మృతి చెందారు.
TWO STUDENTS DIED WHILE WENT TO SWIMMING IN PRAKASHA DISTRICT