అదుపు తప్పిన ఆటో... ఇద్దరికి తీవ్ర గాయాలు - undefined
ఆటో అదుపు తప్పి వాగు గోతిలో పడిన ఘటనలో... ఇద్దరు తీవ్రంగా.. మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది.
అదుపు తప్పిన ఆటో
ప్రకాశం జిల్లా దర్శి నుంచి అద్దంకి వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో.. పెద్ద ఉల్లగల్లు దగ్గర అదుపుతప్పి వాగులోకి దూసుకుపోయింది. అక్కడి గోతిలో పడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన పోలీసులు.. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరితో పాటు.. స్వల్పంగా గాయపడిన మరో ఆరుగురిని దర్శి ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో విషమ పరిస్థితిలో ఉన్న ప్రభుదాసు, మరియమ్మను.. మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలుకు తరలించారు.