ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి - ప్రకాశం జిల్లా నేర వార్తలు

ప్రకాశం జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదంలో మృతి చెందిన వృద్దుడు
ప్రమాదంలో మృతి చెందిన వృద్దుడు

By

Published : Feb 15, 2021, 1:03 AM IST

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పెద్దచేర్లోపల్లి మండలం వరిమడుగు గ్రామానికి చెందిన తిరపతయ్య పెద ఇర్లపాడు గ్రామం నుంచి వరిమడుగు గ్రామానికి వెళ్తుండగా.. వెంగలాయపల్లి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ముళ్ల పొదలలోకి దుసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

పామూరు మండలం బోట్లగూడూరు గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు వాగులో జారిపడి పశువుల కాపరి పుట్టా రామయ్య మృతి చెందాడు. గేదెలను మేపేందుకు వెళ్లిన వృద్దుడు రామయ్య... వాటికి నీళ్లు తాగించేందుకు సమీపంలోని వాగు దగ్గరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు వాగులో జారిపడి మృతి చెందాడు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని..పంచనామా నిమిత్తం మృతదేహాలను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఇదీ చదవండి

రీకౌంటింగ్ నిర్వహించాలని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన

ABOUT THE AUTHOR

...view details