ప్రకాశం జిల్లా పెద్దారవీడు సమీపంలోని చెరువు కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనదారుల తలలకు బలమైన గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు దోర్నాల మండలానికి చెందిన వెన్నా భీమిరెడ్డి, వెన్నా వెంకటేశ్వరరెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ రైతు కుటుంబాలకు చెందినవారే.
శిరస్త్రాణం ధరించి ఉంటే ప్రాణాలతో బయటపడేవారని ఆ ప్రమాదం జరిగిన తీరును చూస్తే తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని పలువురంటున్నారు.