ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గుండ్లకమ్మ వాగులో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మృతులు ఇరువురూ అదే మండలానికి చెందిన కాటంరాజు, గాలెయ్యలుగా పోలీసులు గుర్తించారు. గత నెల 28 నుంచి వారు కనిపించడం లేదని మార్కాపురం గ్రామీణ పోలీసు స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇద్దరు స్నేహితులు ఎక్కడికో వెళ్లి ఉంటారని పోలీసులు భావించారు. 28వ తేదీ రాత్రి ఇంటికి వెళ్తూ.. ప్రమాద వశాత్తు గుండ్లకమ్మ వాగులో పడి మృతి చెందారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ కిషోర్ కుమార్ పరిశీలించారు.
గుండ్లకమ్మ వాగులో పడి ఇద్దరు మృతి - markapuram gundlakamma lake deaths
ఇంటికి వెళ్తూ.. ప్రమాదవశాత్తు గుండ్లకమ్మ వాగులో పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఈ ఘటన జరగ్గా.. స్థానికులు వారి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

గుండ్లకమ్మ వాగులో మృతులు