మతిస్దిమితం లేని ఓ బాలికపై ఇద్దరు యువకులు ఆత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. వేటపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మానసిక స్థితి సరిగా లేని 15 సంవత్సరాల బాలికపై నాగరాజు, లక్ష్మణ్ అనే యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. జాలిరెడ్డి, అనిల్ అనే ఇద్దరు యువకులు వారికి సహకరించారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న చీరాల డీఎస్పీ శ్రీకాంత్ బాలిక ఇంటిని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. బాలికను వైద్య పరీక్షల కోసం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
దారుణం: మతిస్థిమితం లేని బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం - vetapalem latest news
ప్రకాశం జిల్లా వేటపాలెంలో అమానుష ఘటన జరిగింది. రైల్వే స్టేషన్ సమీపంలో మతిస్థిమితం లేని బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. వారికి మరో ఇద్దరు యువకులు సహకరించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.
girl raped by two people in prakasham district