ఆగివున్న గ్రానైట్ లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలం డేగరమూడి వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న కనపర్తి రాజేష్, అశోక్ మృతి చెందగా గాయపడిన అంకమ్మను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన అశోక్ చీరాలకు చెందినవాడు కాగా ..మరో మృతుడు రాజేష్ మార్టూరుకు చెందిన యువకుడిగా గుర్తించారు. మార్టూరు ఎస్ఐ శివకుమార్ కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి - మార్టూరులో రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లా మార్టూరు మండలం డేగరమూడి వద్ద ఆగివున్న గ్రానైట్ లారీని ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం