OMICRON CASES IN AP : రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు - ఏపీ ఒమిక్రాన్ కేసులు
23:55 December 25
ఇప్పటి వరకు ఏపీలో 6 ఒమిక్రాన్ కేసులు నమోదు
OMICRON CASES IN AP : రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 48 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. 19 వ తేదీ నమునా సేకరించి పరీక్షలకు పంపించగా... ఒమిక్రాన్‌గా తేలింది. యూకే నుంచి అనంతపురం వచ్చిన 51 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య ఆరుకు చేరింది. బాధితుల కుటుంబసభ్యులకు నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి విదేశాల నుంచి 67 మంది వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చినవారిలో 12 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు తెలిపింది.
ఇదీ చదవండి