ప్రకాశం జిల్లా ఒంగోలు అగ్రహారం నూతన జాతీయ రహదారి వంతెనపై ప్రమాదం జరిగింది. ఆగివున్న తమిళనాడుకు చెందిన సిమెంట్ లారీలను చీమకుర్తి నుంచి వస్తున్న గ్రానైట్ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. గ్రానైట్ లారీలో ఉన్న డ్రైవర్, క్లినర్ క్యాబిన్లో ఇరక్కుపోయారు. ఘటన జరిగిన ప్రదేశానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మూడు గంటల పాటు శ్రమించి ఇద్దరిని బయటకు తీశారు. క్షతగాత్రులకు తీవ్ర గాయాలయ్యాయి.
రెండు లారీలు ఢీ... ఇద్దరికి తీవ్రగాయాలు - ఒంగోలులో రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లా ఒంగోలులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ లారీని గ్రానైట్ లారీ ఢీ కొట్టింది. గ్రానైట్ లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లా అగ్రహారం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన గ్రనైట్ లారీ
TAGGED:
ఒంగోలులో రోడ్డు ప్రమాదం