Two dead: ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి - ప్రకాశం జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Two dead: వాగులో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ట్రాక్టర్ లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Two dead: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం నెకునంబాదు వద్ద వాగులో ట్రాక్టర్ బోల్తా పడి... ఇద్దరు మృతి చెందారు. కొలకలూరి ఇర్మియా, అతని అన్న కుమారుడు జస్వంత్ కలిసి.. ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇటుకలు తీసుకువచ్చేందుకు గ్రోత్ సెంటర్‌కి వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా.. నెకునంబాదు వాగు వద్ద ఎదురుగా వచ్చే కారును తప్పించబోయి.. పక్కనే ఉన్న లోయలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:Accident: కృష్ణా జిల్లా తాడంకి పైవంతెన వద్ద ప్రమాదం.. ఇద్దరు మృతి