ప్రకాశంజిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో చిన్న పాటి వివాదం పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఎస్పీ కాలనీకి చెందిన రెండు కుటుంబాలు కర్రలతో దాడి చేసుకున్నాయి.
బీకేపాడులో కర్రలతో ఇరుపక్షాల దాడి.. ఆరుగురికి తీవ్రగాయాలు - ప్రకాశం జిల్లా వార్తలు
చిన్నపాటి వివాదం పెద్ద ఘర్షణకు దారి తీసింది. పశువుల మేత తెస్తుండగా చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది.
![బీకేపాడులో కర్రలతో ఇరుపక్షాల దాడి.. ఆరుగురికి తీవ్రగాయాలు two gangs fight in bk padu prakasham district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13215260-73-13215260-1632974383007.jpg)
two gangs fight in bk padu prakasham district
కాలనీలోని ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి తన ద్విచక్రవాహనంపై గడ్డి మోపు తీసుకొస్తుండగా మరోవ్యక్తికి తగిలింది. దీంతో గొడవ మొదలైంది. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఘర్షణలో కావూరి నాగేష్, మందా పిచ్చమ్మ, మందా మరియమ్మ, మందా బాల ఏసు, కావూరి గంగయ్య, మందా జోసెఫ్ గాయాల పాలయ్యారు. వారి మధ్య ఇంతకుముందే గొడవలు జరుగుతున్నాయని కాలనీ వాసులు చెప్పారు.
ఇదీ చదవండి:AUTO ACCIDENT : ఆటో బోల్తా... 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు