సాటివారికి సహాయం చేయాలి అంటే గొప్పవాళ్ళే కానవసరం లేదు మంచి మనసుంటే చాలు అని నిరూపించారు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కనిగిరి పట్టాణానికి చెందిన శారద, మౌనిక అనే స్నేహితులు. బ్యాచిలర్ అఫ్ డెంటల్ సర్జన్ (బిడియస్) విద్యను పూర్తి చేసి ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో నూతన వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి వచ్చిన మొదటి నెల జీతం మొత్తం పేద ప్రజలకు సహాయం చేయాలనే సంకల్పించారు. ఆ ఆలోచనను కనిగిరిలోని స్నేహహస్తం ఫౌండేషన్ సుధీర్ బాబుకు సమాచారం అందించారు.
సాయం చేయాలంటే గొప్పవాళ్లే కానవసరం లేదు.... మనసుంటే చాలు - ప్రకాశం జిల్లా కనిగిరిలో స్నేహహస్తం ఫౌండేషన్ వార్తలు
ప్రకాశం జిల్లా కనిగిరిలో నూతనంగా విధుల్లోకి చేరిన ఇద్దరు డాక్టర్లు సేవా దృక్ఫథాన్ని చాటుకున్నారు. తమ మెుదట నెల జీతాన్ని పేదల కొరకు వెచ్చించాలని సంకల్పించారు. స్నేహహస్తం ఫౌండేషన్‌తో కలిసి పేదలకు,యాచకులకు అన్నదానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు.
సాయం చేయాలంటే గొప్పవాళ్లే కానవసరం లేదు.... మనసుంటే చాలు
ఫౌండేషన్ సభ్యులతో కలసి సుమారు 300 మందికి భోజనం తయారు చేయించారు. కనిగిరి పట్టణంలోని శివారు కాలనీలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు, యాచకులకు శారద, మౌనిక స్వయంగా భోజనాలను వడ్డించారు. చిన్న వయసులోనే శారద, మౌనికలు గొప్ప మనసుతో నిరుపేదల ఆకలి తీర్చటం చాలా ఉన్నతమైదని స్నేహహస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుధీర్ బాబు అన్నారు.
ఇవీ చదవండి