ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగి ఉన్న ట్రాక్టర్​ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం... ఇద్దరు మృతి - addanki road accident update

ఆగి ఉన్న ట్రాక్టర్​ను ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగింది.

accident
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

By

Published : Jan 30, 2021, 10:51 AM IST

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీ సమీపంలో.. ఆగి ఉన్న ట్రాక్టర్​ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ముండ్లమూరు మండలం ఖమ్మంపాడుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నరేంద్రబాబు వద్ద బుల్లిబాబు సహాయకుడిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కంకర లోడును తీసుకువెళ్తున్న సమయంలో... రాజీవ్ కాలనీ వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్ పంక్చర్ కావటంతో... రహదారి పక్కనే టైరు మార్చుతున్నారు.

ఈ క్రమంలోనే, మేదరమెట్ల వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ట్రాక్టర్​ను వేగంగా ఢీకొట్టంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి.. ట్రాక్టర్ మరమ్మతులు చేస్తున్న బుల్లియ్య అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ద్విచక్ర వాహనదారుడిని నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరుకి చెందిన కస్తూరయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details