ప్రకాశం జిల్లా చీరాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చీరాల బైపాస్ లోని మన్నం అపార్ట్మెంట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు.
చీరాల బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - చీరాల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
08:55 October 16
గుర్తు తెలియని వాహనం ఢీ
జాతీయ రహదారి పక్కన ఇద్దరు యువకుల మృతదేహాలు పడి ఉండగా.. వారిని సాయికాలనీకి చెందిన రవిచంద్, మరియమ్మపేటకు చెందిన విల్సన్‌గా స్థానికులు గుర్తించారు. తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలంలో నంబర్ ప్లేట్..
ప్రమాదం జరిగిన చోట మరో వాహనానికి సంబంధించిన నంబర్ ప్లేట్ పడి ఉంది. దీంతో ప్రమాదానికి కారణం ఆ వాహనమేమోనని పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి