ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని గరటయ్య కాలనీ వద్ద కూలీల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా... మరో 10 మంది కూలీలు గాయపడ్డారు. అద్దంకి నుంచి ఇంకొల్లు మండలం కొనంగికి మిరపకాయల కోతకు ఆటోలో వెళ్తున్న కూలీలను లారీ బలంగా ఢీకొట్టింది. మృతులు అద్దంకి మౌలానగర్‌కు చెందిన అనసూర్యమ్మ, షేక్ కరిమున్‌గా గుర్తించారు. గాయపడిన వారిని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..
కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు - అద్దంకి వద్ద లారీ ఆటో ఢీ
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పది మందికి గాయాలయ్యాయి.
auto lorry accident at addanki