ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీవ్ర విషాదం: నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి - దుగ్గిరెడ్డిపాలెంలో నీటికుంటలో పడి చిన్నారులు మృతి వార్తలు

ఇద్దరు అన్నదమ్ములు. ఒకరు 7, మరొకరు 4వ తరగతి చదువుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నవారు నేడు అమ్మానాన్నలతో కలిసి పొలం వెళ్లారు. వారు పని చేసుకుంటుండగా వీళ్లిద్దరూ చక్కగా ఆడుకుంటున్నారు. వారిని చూస్తూ తల్లిదండ్రులు మురిసిపోతూ తమ పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే అంతులేని విషాదం. అప్పటివరకూ గెంతుతూ, తుళ్లుతూ ఆడుతున్న పిల్లలు విగతజీవులుగా మారారు. పొలంలోని నీటి కుంటలో పడి మృతిచెందిన చిన్నారుల్ని చూసి వారి అమ్మానాన్నలు రోదిస్తున్న తీరు మనసును కలిచివేస్తోంది.

two children died in a water pool at duggireddypalem prakasam district
నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

By

Published : May 10, 2020, 5:05 PM IST

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం దుగ్గిరెడ్డిపాలెంలో విషాదం జరిగింది. నీటికుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. గ్రామానికి చెందిన ఆకుల మణికంఠ, బాల మణికంఠ వారి తల్లిదండ్రులతో కలిసి పొలం వెళ్లారు. అమ్మానాన్న పని చేసుకుంటుండగా వీరిద్దరూ ఆడుకుంటున్నారు.

ఆటల్లో దుస్తులకు మట్టి అంటుకోవటంతో కడుక్కోవడం కోసం పొలంలో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ జారి అందులో పడిపోయి మరణించారు. వీరి మరణంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు చనిపోవటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details