ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టూత్​ పేస్ట్ అనుకుని... ఎలుకల మందు తిన్న చిన్నారులు - tooth paste and rat drug

ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ టూత్ పేస్ట్ అనుకుని ఎలుకల మందు తిన్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వీరిలో ఒకరు మృతి చెందారు.

చిన్నారి

By

Published : Oct 20, 2019, 5:28 PM IST

ఎలుకల మందు తిన్న చిన్నారులు

ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం బూదవాడలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్‌ ఫిరోజ్‌ కుమారుడు బాబుద్దీన్‌(5) ఈ నెల 17 తేదీన ఇంటి వద్ద తన చెల్లితో కలిసి ఆడుకున్నాడు. ఈ సమయంలో "టూత్‌ పేస్టు" అనుకుని పొరపాటున ఇంటిలో ఎలుకలను చంపేందుకు తెచ్చిన పేస్టును ఇద్దరూ తిన్నారు. ఇది గమనించని వారి తల్లి... ఇద్దరినీ ఇంటికి తీసుకుపోయి స్నానం చేయించి అన్నం తినిపించింది. రాత్రి సమయంలో చిన్నారులు ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఇంకొల్లులోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించిన కారణంగా.. అక్కడి నుంచి గుంటూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బాలుడు శనివారం మృతి చెందగా బాలిక కోలుకుంటోంది. చనిపోయిన తన అన్నయ్యను చూసి ఆ చిన్నారి తీవ్రంగా రోదించింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details