ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం: విద్యుదాఘాతంతో అన్నాదమ్ములు మృతి

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో అన్న కూడా మృతి చెందాడు.

విషాదం: విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి
విషాదం: విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి

By

Published : Dec 8, 2020, 9:29 PM IST

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రోశయ్య కాలనీలో విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. రామాపురం రహదారిలో రోశయ్య కాలనీకి చెందిన కోనేటి ఆంజనేయులు(14), నాగమయ్య(13) సమీపంలోని ఇందిరానగర్ కాలనీలో మూతపడ్డ రైస్ మిల్లు గోడ ఎక్కి పిట్టలు కొట్టే పనిలో ఉన్నారు. రైస్ మిల్లుకు వెళ్లే విద్యుత్ తీగలు ఎత్తు తక్కువలో ఉన్నాయి. ప్రమాదవశాత్తు నాగమయ్యకు విద్యుత్ తీగలు తగిలాయి. తమ్ముడికి షాక్ కొట్టడంతో రక్షించే క్రమంలో ఆంజనేయులు కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details