ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శంకవరం గ్రామ సమీపంలో పాలకేంద్రం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వేగంగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. మొత్తంగా నలుగురు గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను స్థానికులు.. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. మెరుగైన చికిత్స నిమిత్తం నలుగురిని ఒంగోలుకు తరలించారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... నలుగురికి గాయాలు - prakasam dst bike accidnets
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శంకవరం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొట్టుకోగా ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.
two bike accident in prakasam dst forur injured