solar plates: ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు, వెంపరాల, నాగులపాడు గ్రామ పొలాల్లో సోలార్ ప్లేట్లను అపహరిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.1.55 లక్షల విలువైన 41 సోలార్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు.
ముండ్లమూరు మండలం తుమ్మలూరుకు చెందిన తిరుపతిరావు, బ్రహ్మయ్య అనే ఇద్దరు పాత నేరస్తులు ఇద్దరూ కలిసి మూడు చోట్ల సోలార్ ప్యానల్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరు గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.