ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్కాపురం హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ - మార్కాపురం హత్యకేసు వార్తలు

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఏకలవ్య కాలనీలో జరిగిన హత్య కేసులో... ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు వెంకటేశ్వర్లు భార్య అశ్వినితో పాటు ఆమె ప్రియుడు దేవరాజ్​ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు.

Two accused were arrested in Markapuram murder case
మార్కాపురం హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

By

Published : Sep 13, 2020, 1:08 PM IST



ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఏకలవ్య కాలనీలో జరిగిన హత్య కేసులో... ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 29న జరిగిన హత్య కేసులో మృతుడి భార్య అశ్వినితో సహా ఆమె ప్రియుడు దేవరాజ్​ను అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధమే వెంకటేశ్వర్లు హత్యకు కారణమని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి వెల్లడించాడు. పక్కా ప్రణాళిక ప్రకారమే భర్త వెంకటేశ్వర్లును తీసుకెళ్లి ప్రియుడితో కలిసి అశ్విని హత్య చేయించింది డీఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details