ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rains in AP: రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు.. కనిగిరిలో విద్యుత్ లేక నిలిచిన డయాలసిస్ సేవలు - Andhra Pradesh Rain conditions

Heavy rainfall across Andhra Pradesh: రాష్ట్రంలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో విద్యుత్ అంతరాయం డయాలసిస్ రోగులను ఇబ్బందులకు గురి చేస్తోంది. భారీ ఈదురు గాలుల కారణంగా... విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అయితే, ఆసుపత్రిలో జనరేటర్‌ ఉన్నప్పటికీ అదీ కూడా మరమ్మతులకు గురికావడంతో డయాలసిస్ కోసం పలు ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఇబ్బంది పడ్డారు.

Etv Bharat
Etv Bharat

By

Published : May 30, 2023, 5:13 PM IST

Troubles due to rains across the state: రాష్ట్రంలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో విద్యుత్ అంతరాయం డయాలసిస్ రోగులను ఇబ్బందులకు గురి చేస్తోంది. భారీ ఈదురు గాలుల కారణంగా... విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అయితే, ఆసుపత్రిలో జనరేటర్‌ ఉన్నప్పటికీ అదీ కూడా మరమ్మతులకు గురికావడంతో డయాలసిస్ కోసం పలు ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఇబ్బంది పడ్డారు.

డయాలసిస్ రోగుల ఇక్కట్లు:విద్యుత్ అంతరాయంఏర్పడింది కదా జనరేటర్ ఎందుకు ఆన్ చేయలేదని ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రశ్నించగా.. అందుకు డయాలసిస్ సిబ్బంది మాత్రం కాకమ్మ కథలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. డయాలసిస్ చేయించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు వైద్యశాలలోని కుర్చీలే వారికి బెడ్లుగా మారాయి. డయాలసిస్ కోసం కొందరికి 10 గంటలకు షిప్ట్ ఉండగా మధ్యాహ్నం అవుతున్నప్పటికీ.. జనరేటర్ మరమ్మతులు చేయలేదు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను కుర్చీలలో కూర్చోబెట్టి అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జనరేటర్లను ఆన్ చేసి వారికి వైద్య సేవలు అందించాలని కిడ్నీ రోగులు వేడుకుంటున్నారు.

విద్యుత్ అంతరాయంతో డయాలసిస్ రోగుల ఇబ్బందులు

వర్షానికి విద్యుత్ కట్ జనరేటర్ ఉన్నా చీకట్లోనే రోగులు

నెల్లురు జిల్లాలో ఈదురుగాలులు: నెల్లురు జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఒక్క సారిగా వాతవరణం మారిపోయింది. అప్పటి వరకు ఎండగా ఉన్న వాతవరణం మారిపోయి ఈదురుగాలులు మెుదలయ్యాయి. నెల్లూరు, కావలి, కందుకూరు, గుడ్లూరులోని పలు ప్రాంతాలల్లో ఈదురుగాలులకు పలుచోట్ల భారీ వృక్షాలు కూలాయి. ఫ్లెక్సీలు, కటౌట్లు గాలికి కొట్టుకుపోయాయి. వర్షాలకు చెట్ల కింద ఉండకుడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

పిడుగుపాటుకు వ్యక్తి మృతి: బాపట్ల జిల్లా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షం కారణంగా నక్కబొక్కలపాడు వద్ద పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి చెందాడు. పిడుగు పాటుగు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఊపిరి పీల్చుకున్న ప్రజలు నిన్నటి నుంచి మారిన వాతావరణం పలు జిల్లాల్లో వర్షాలు

సైబీరియా వలస పక్షులు: శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామంలో రాత్రి గాలివానకు సైబీరియా వచ్చిన వలస పక్షులు మృత్యువాత పడ్డాయి. సుమారుగా వంద పక్షులు మృతి చెందగా.. మరి కొన్ని పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి. సైబీరియా ఎర్ర కాళ్ళ కొంగలుగా పిలవబడే ఈ పక్షుల పిల్లలు మృతి చెందడం.. మరికొన్ని పక్షి పిల్లలు తీవ్రంగా గాయపడ్డాయి. దెబ్బతిన పక్షులు ఎగరలేక గ్రామంలో దీనంగా తిరుగుతున్నాయి. వలస పక్షులు వచ్చిన సమయంలో అధికారులు వాటికి రక్షణ కల్పించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details