మహా శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో.. పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి రథోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను శ్రీగిరి నుంచి మంగళవాయిద్యాలతో తీసుకువచ్చి రథాన్ని అధిష్ఠింపచేశారు. దేవదేవేరుల రథాన్ని రంగు రంగుల పుష్పాలతో రమణీయంగా అలంకరించారు.
కన్నులపండువగా త్రిపురాంతకేశ్వర రథోత్సవం
ప్రముఖ దేవాలయం త్రిపురాంతకేశ్వర క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండువగా సాగింది.
ఘనంగా త్రిపురాంతకేశ్వర రథోత్సవం
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులు రథం వద్ద పూజలు చేశారు. అనంతరం రథ శాల నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు భక్తుల మధ్య ఉత్సవం కన్నులపండువగా సాగింది. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.
ఇదీ చదవండి:చీరాలలో మట్టి పాత్రల అమ్మకాలు.. ఆసక్తి చూపుతున్న కొనుగోలుదారులు