కరోనా కష్టకాలంలో విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి సేవలందించిన యోధులను ఒంగోలుకు చెందిన నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు. పోలీసులు, పాత్రికేయులకు అవార్డులు అందజేశారు. విజయదశమి సందర్భంగా ఒంగోలు రెడ్‌క్రాస్ భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. లాక్డౌన్ సమయంలో ప్రజలకు వార్తలు అందించడంతో పాటు కరోనా పట్ల అవగాహన కల్పించి, అప్రమత్తం చేసిన జర్నలిస్టుల సేవలు మరువలేనివని, పోలీసులు లాక్డౌన్ అమలు చేయడంలో ఎంతో శ్రమించారని నవయుగ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మస్తాన్చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆడిషనల్ ఎస్పీ రవిచంద్ర హాజరయ్యారు. కరోనా సమయంలో సేవలందించిన వారిని గుర్తించి సత్కరించటం అభినందనీయమని పేర్కొన్నారు.
నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా యోధులకు సత్కారం - Navayuga Foundation latest news
కరోనా సమయంలో సేవలందించిన పాత్రికేయులు, పోలీసులను నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు. కరోనా కాలంలో సేవలందించిన వారిని గుర్తించి సత్కరించటం అభినందనీయమని ఆడిషనల్ ఎస్పీ రవిచంద్ర పేర్కొన్నారు.
నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా యోధులకు సత్కారం