ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AGITATION: న్యాయం చేయాలంటూ కలెక్టరేట్​ ఎదుట గిరిజనుల ఆందోళన - ongole news

పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయనందుకు గ్రామంలోని వైకాపా నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఒంగోలు కలెక్టరేట్​ వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టారు. తమను చంపేస్తామని వారు బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

agitation at ongole collectorate for justice by tribals
న్యాయం చేయాలంటూ కలెక్టరేట్​ ఎదుట గిరిజనుల ఆందోళన

By

Published : Jun 14, 2021, 6:44 PM IST

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి చెంచు కాలనీలోని గిరిజనులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వారు ఆందోళన(AGITATION) చేపట్టారు. గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన వైకాపా నాయకులు సర్పంచి ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేయలేదని.. తమపై కక్షపూరితంగా కర్రలతో దాడులు చేశారని వాపోయారు.

ఎన్నో ఏళ్లుగా తాము గ్రామంలోనే నివాసం ఉంటున్నామని.. కానీ ప్రస్తుతం కొందరు తాము నివశిస్తున్న భూమిని ఆక్రమించుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రాత్రి సమయాల్లో తమ కుటుంబాలపై దాడులు చేసి గాయపరిచారని వెల్లడించారు. నివాసముంటున్న స్థలాన్ని ఖాళీ చేయకపోతే చంపేస్తామంటూ గ్రామంలోని పెద్దలు బెదిరిస్తున్నారని తెలిపారు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details