ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ పాఠశాల ప్రాంగణం... ఎందరికో ఆదర్శం

ప్రకాశం జిల్లా శింగరకొండడలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రాంగణం మనకు చెట్లతో స్వాగతం పలుకుతోంది. చెట్లపై వేసిన చిత్రాలు, రాసిన స్ఫూర్తిదాయక సందేశాలు, నీతి వాక్యాలు అక్కడకు వచ్చే వారిని ఆకట్టుకుంటున్నాయి.

tree paintings in singarayakonda gurukul school
సింగరాయకొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల

By

Published : Feb 24, 2020, 7:40 AM IST

Updated : Feb 24, 2020, 9:55 AM IST

శింగరకొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల

ఆ పాఠశాల ఆవరణలోకి అడుగు పెట్టగానే పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. అక్కడి విద్యార్థినులు శ్రద్ధతో పెంచిన మొక్కలు మనకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పాఠశాలలో ఎటు చూసినా పచ్చదనమే. ఈ శ్రమ వెనుక అక్కడ చదివే విద్యార్థినిలు, వారిని ప్రోత్సహించే ఉపాధ్యాయుల ఉన్నారు.

శింగరకొండ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులంలో 5 నుంచి ఇంటర్ వరకు మొత్తం 640 మంది విద్యార్థులున్నారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచటంలో వీరంతా ఆసక్తి చూపుతుంటారు. పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు వస్తుంటారు. వీరంతా చెట్లకింద ఎక్కువ సమయం గడుపుతారు. అలాంటి ప్రదేశంలో నీతి వాక్యాలు రాస్తే అందరికీ ఎంతో కొంత విజ్ఞానం లభిస్తుందని ప్రిన్సిపాల్ వాసవి భావించారు. ఆహ్లాదంతో పాటు అందంగా ఉంటాయని ఆలోచించి.. ఆచరణలోకి తీసుకొచ్చారు.

9వ తరగతి చదువుకునే విద్యార్థినిల్లో కొంతమందిని ఎంపిక చేసి చెట్లపై నీతి వాక్యాలు రాయించారు. చెట్లపై వివేకానంద, బాబాసాహెబ్ అంబేడ్కర్, గాంధీజీ చిత్రాలు, సమాజానికి ఉపయోగపడే సూక్తులను రంగులతో ఆకట్టుకునేలా.. ఆకర్షణీయంగా చిత్రించారు. ఆపై అందరి మన్ననలు పొందుతున్నారు.

ఇదీ చదవండి :

విశాఖ తీరం కోత నివారణకు సహజసిద్ధ పరిష్కారం

Last Updated : Feb 24, 2020, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details